
సమర్పిస్తున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
ఉదయాస్తమాన సేవలు
శ్రీవారి సేవకు అందరూ ఆహ్వానితులే






భక్తి, పరమార్థం, సేవల కలయిక
ఉదయాస్తమాన సేవలు
ఉదయాస్తమాన సేవలు” అనేది రొటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్, విజయవాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతున్న అద్వితీయ ధార్మిక కార్యక్రమం. ఈ రెండు రోజుల కార్యక్రమం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలకు అంకితం చేయబడింది, అందులో తిరుమలలో జరిగే అన్ని సేవలు, పూజలు తిరుమల పండితుల నేతృత్వంలో ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించబడతాయి.
- ఈ మహోత్సవంలో తిరుమలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే ప్రతీ సేవ, పూజను అదే విధంగా తిరిగి సజీవీకరించడం ద్వారా భక్తులకు తిరుమల అనుభూతిని విజయవాడలోనే అందించే అవకాశాన్ని కల్పించబోతున్నాం.
- ప్రవేశం ఉచితం! భక్తులందరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని రొటరీ క్లబ్ అహ్వానిస్తుంది.
- భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన ఓ మహోత్సవానికి హాజరుకావడానికి మర్చిపోకండి!
కిషోర్ గుడిపాటి
Kishore Gudipati- Club President
కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది
విజయవాడ, యం. జి. రోడ్ లోగల బృందావన్ కాలనీ నందు గల A కన్వెన్షన్ హాలులో కార్యక్రమం జరుగుతుంది.
కార్యక్రమం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతుంది
2025 - మార్చి నెల 22 మరియు 23 తారీఖులు అనగా కృష్ణ పక్షం అష్టమి మరియి నవమి రొజులలో (శనివారం మరియు ఆదివారం)
కార్యనిర్వాహక కమిటీ సభ్యులు
రోటరీ మిడ్‌టౌన్ క్లుబ్ వారు నిర్వహిస్తున్న ఘనమైన సేవా కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం !!!

Rtn శ్రీ గుడిపాటి కిషోర్ గారు
రొటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్ అధ్యక్షులు

Rtn శ్రీ బత్తుల సుందర్ రెడ్డి గారు
రొటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్ కార్యదర్శి

Rtn శ్రీ స్వీట్ శ్రీను (బాలాజీ) గారు
కార్యక్రమ కమిటీ చైర్మన్

Rtn శ్రీ యడ్ల పార్థ సారధి గారు
కార్యక్రమ కన్వీనర్
ఈ పుణ్యకార్యానికి అహ్వానితులైన మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. తిరుమల వేద పండితుల ఆధ్వర్యంలో జరిగే ఈ సేవలు భక్తులందరికీ మోక్షసాధనలో ఒక గొప్ప అనుభూతినిస్తుంది. భక్తి, ఆధ్యాత్మికత, సేవల సమ్మేళనంగా నిలిచే ఈ కార్యక్రమాన్ని మీరు తప్పక దర్శించాలి. - శ్రీ గుడిపాటి కిషోర్, అధ్యక్షుడు
ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలను రొటరీ క్లబ్ విజయవాడ మిడ్‌టౌన్ నిర్వహించినా, ఈ కార్యక్రమం భక్తి ప్రియులకు మరపురాని అనుభూతిని అందించనుంది. మీరు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. - శ్రీ బత్తుల సుందర్ రెడ్డి, కార్యదర్శి
కార్యక్రమ ప్రత్యేకతలు
శ్రీ వేంకటేశ్వర స్వామి సేవల విశేషాలు
రొటరీ క్లబ్ ఆఫ్ మిడ్‌టౌన్, విజయవాడ ఆధ్వర్యంలో, తిరుమలలో జరిగే భగవంతుని సేవలను విజయవాడలో భక్తులందరికీ అందించాలనే లక్ష్యంతో ఈ ఉదయాస్తమాన సేవలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ రెండు రోజుల పుణ్యోత్సవంలో శ్రీవారి తిరుమల ఆలయంలో జరిగే అన్ని పూజలు, సేవలు, తంత్రాలు ఆగమశాస్త్ర ప్రకారం తిరుమల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించిన వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి.
ఈ సేవల ప్రత్యేకత
- తిరుమలలో జరిగే ప్రతీ సేవ ఇక్కడ పునరావృతం అవుతుంది
- శాస్త్రోక్తంగా, ఆగమ నియమాల ప్రకారం పూజలు
- భక్తులందరికీ ఉచిత ప్రవేశం – కుటుంబ సమేతంగా రండి, స్వామివారి ఆశీస్సులు పొందండి!
- తిరుమల స్వామివారి సేవలను ప్రత్యక్షంగా అనుభవించడానికి ఒక అరుదైన అవకాశం!
- భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన ఓ మహోత్సవం
- కుటుంబ సమేతంగా దర్శించుకుని పుణ్యం పొందే విశేష అవకాశం
ఈ మహోత్సవాన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి దర్శించుకోండి, భగవంతుని కృపకు పాత్రులు అవ్వండి!
ఉదయాస్తమాన సేవలు – కార్యక్రమ షెడ్యూల్ – మార్చి 22 & 23, 2025
1వ రోజు – మార్చి 22, 2025 (శనివారం)
ఉ. 6 గం. లకు
సుప్రభాత సేవ, కొలువు
శ్రీవారిని మేల్కొలిపే పవిత్ర ఘట్టం
ఉ. 9:30 గం. లకు
తోమాల సేవ, సహస్రనామార్చన
శ్రీవారి అలంకరణ & 1000 నామాలతో అర్చన
ఉ. 10:00 గం. లకు
శ్రీవారి కళ్యాణోత్సవానికి పసుపు కొట్టుట
వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లు
ఉ. 10:30 గం. లకు
శ్రీవారి తిరుమంజనం & అష్టోత్తర శత కలశాభిషేకం
108 కలశాలతో
సా. 6 గం. లకు
శ్రీవారి కళ్యాణోత్సవం
శ్రీవారి & అమ్మవార్ల కళ్యాణ ఘట్టం
రా. 9 గం. లకు
ఏకాంత సేవ
భగవంతుని శయనోత్సవం
2వ రోజు – మార్చి 23, 2025 (ఆదివారం)
ఉ. 6 గం. లకు
సుప్రభాత సేవ, కొలువు, తోమాల సేవ, సహస్రనామార్చన
శ్రీవారిని మేల్కొలిపే పవిత్ర ఘట్టం
ఉ. 10:00 గం. లకు
తిరుప్పవడ సేవ
శ్రీవారి నైవేద్య విశేష సేవ
ఉ. 11:00 గం. లకు
శ్రీవారి కళ్యాణోత్సవం
శ్రీవారి & అమ్మవార్ల కళ్యాణ ఘట్టం
సా. 5 గం. లకు
శ్రీవారి పుష్పయాగ శోభాయాత్ర
పుష్ప సుందర పల్లకీ ఉత్సవం
సా. 6 గం. లకు
శ్రీ పుష్పయాగం
ఆనేక పుష్పములతో శ్రీవారి ప్రత్యేక యాగం
రా. 9 గం. లకు
ఏకాంత సేవ
రాత్రి స్వామివారి శయనోత్సవం
గత కార్యక్రమ ఫోటోలు & వీడియోలుగత ఏడాది ఉదయాస్తమాన సేవల విజయవంతమైన విశేష చిత్రాలను చూడండి!
— భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన ఓ మహోత్సవ ఘట్టం.